పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

54

171. సూర్యరశ్మి ఎచ్చోటపడినను ఒకేతీరుననుండును. అయినను నిశ్చలముగనున్ననీరో, లేక అద్దమో, లేకమెఱుగుపెట్టిన లోహపురేకో, సూర్యబింబమును పూర్తిగ ప్రతిఫలింపజేయును. భగవంతుని దివ్యతేజము నిట్లేయగును. పక్షపాతము లేక అది సమానముగా అందఱి హృదయములమీదను ప్రసరించును. కాని సజ్జనుల యొక్కయు, సాధుపుంగవుల యొక్కయు నిర్మలనిష్కళంక హృదయములు మాత్రమేదానిని స్వీకరించి చక్కగా ప్రతిబింబింపజేయును.

172. భగవంతుడును, వానివాక్కులును, వానిభక్తులును, అందఱును ఒక్కటియే, అభిన్నము.

173. నిజముగ భక్తుడు భగవంతుని యెట్లుభావించును? బృందావన గోపికలు శ్రీకృష్ణుని జగన్నాధునిగా భావించక తమప్రియుడగు గోపికానాధునిగా చూచినవిధమున భక్తుడు భగవంతుని తనకొక దగ్గఱచుట్టముగా చూచుకొనును.

174. నరునిఆత్మ భగవంతునితోడ సంపూర్ణముగ ఐక్య సంధానమును పడయుటసాధ్యమే. అటుల పొందినప్పుడే "ఆతడును నేను నొక్కటియే" (శివోహం) అని భావన చేసి వచింపగల్గును. ఒకగృహమందలి వృద్ధసేవకుడు కాలక్రమమున ఆయింటివారిలో నొకడైపోవ, ఒకానొక దినమున యజమానియే, వానిపనిని మిగుల మెచ్చుకొనినవాడై తాను కూర్చుండు గౌరవస్థానమున కూర్చుండబెట్టి, చుట్టునున్నవారితో ఆదినమునుండి తనకును ఆసేవకునికిని భేదములేదని చెప్పవచ్చును. యజమానుడు "ఇతడును నేనును ఒక్క