పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6వ అధ్యాయము.

భగవంతుడు — భక్తులు.

166. జమీందారుడు గొప్పధనికుడుగ నుండవచ్చును; కాని బీదరయితు అల్పపుకానుకలను తెచ్చి ప్రీతిపూర్వకముగ అర్పించినప్పుడు, వానిని ఆజమీందారుడు మిగుల ఆనందముతో స్వీకరించును. అటులనే సర్వేశ్వరుడగు భగవంతుడు తాను మహిమాఢ్యుడును మహాశక్తిసమన్వితుడును అయిననుగూడ భక్తిపూర్వకముగ అర్పణచేయబడు అల్పపు కానుకలను సయితము మహానందముతోడను పూర్ణసంతృప్తితోడను స్వీకరించును.

167. దుమ్ములోపొర్లాడి ఒడలెల్ల బురదచేసికొనుట పసిబిడ్డకు సహజము. అయినను తల్లిబిడ్డను సదా అట్లే మలినముగ నుండనీయదు. పదేపదేకడుగుచుండును. అటులనే పాపకార్యములు చేయుచుండుట నరునికి సహజము. కాని ఆతడు పాపముచేయుట ఎంతనిశ్చయమో, అతనికి భగవంతుడు తరుణోపాయముల గూర్చుచుండుట ద్విగుణముగా నిశ్చయము.

168. చేపలతోచేయబడు పులుసు, కూర, మొదలగు వానిలో ప్రతివాడును తనకు హితవగుదానిని కోరుకొనునట్లు తనభక్తుల కోరికలదీర్చునిమిత్తము ఒకేభగవంతుడు వేర్వేఱు రూపములు తాల్చుచుండగా, ఒక్కొక భక్తుడును