పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

48

యొక్క మహాశక్తియే ప్రవహించుచు ప్రకటన మగుచున్నదనవచ్చును. ఎల్లఱును అవతారముల గుర్తింపజాలరు. భరద్వాజప్రముఖులు ఏడ్గురుమహాఋషులుమాత్రమే శ్రీరాముని అవతారముగా గ్రహింపగల్గిరి. నారాయణుడు నరునికి స్వచ్ఛమగు జ్ఞానమును భక్తిని నేర్పుటకొఱకై మానవరూపమును ధరించి అవతరించును.