పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

4వ అధ్యాయము.

గల (ఉత్పత్తిస్థానమునుండి సముద్రమున గలియు తావువఱకును అని అర్ధము.) పావన గంగానదిని దర్శించి స్పర్శించితిని" అని చెప్పునుగదా?

152. నీవు భగవంతునికొఱకై వెదుకచూచెదవా? అటులైనచో వానిని నరునియందు వెదకుము! భగవంతుని దివ్యస్వరూపము తక్కినవస్తువులందుకన్న నరునియందు హెచ్చుగ మనకు ప్రకటనమగుచుండును. ఏనరుని హృదయమున భగవత్ప్రేమ నిండి వెల్లువయై ప్రవహించుచుండునో, ఎవడు భవంతునందు వసింపుచు, చరింపుచు, ఉనికిగాంచుచుండునో, ఎవడు భగవద్భక్తితో స్రొక్కిపోవుచుండునో అటువంటివానికొఱకై ఎల్లెడల వెదకుము. అట్టిమనుజునందు భగవంతుడు నీకు ప్రత్యక్షముకాగలడు.

153. ఆతడు అవ్యయుడు, మఱియు యతడే లీలారూపుడును. ఈలీల నాల్గురకములుగనుండును:- ఈశ్వరలీల, దేవలీల, జగల్లీల, నరలీల.[1]

నరలీలయందు భగవదవతారము సంఘటిలగలదు. ఈనరలీల స్వభావము నీకు తెలియునా? పెద్దమేడమీదినుండి యొకతూముగుండ కడువేగమున నీరు ప్రవహించుటను దానికి పోల్చవచ్చును. ఆకాలువగుండా అల సచ్చిదానందబ్రహ్మము

  1. భగవద్భావన నాలుగుతెఱగులు:- ఒకటి ఈశ్వరభావన; అనగా ఈ జగమునకు అధినాధుడు. రెండవది దేవతలరూపము; వీరు జగధీశ్వరుని ప్రతినిధులుగనుండి జగద్వ్యాపారముల నడుపుదురు. మూడవరూపము జగత్తే. నాలుగవది నరరూపము.