పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

46

149. భగవంతుఁడు పరిపూర్ణుడనుట నిజము. మఱియు ఆయన సర్వశక్తివంతుడునైయున్నాడు. ఆయన తనదివ్యమహిమను కరుణరూపమున స్థూలశరీరముదాల్చి ఈశ్వరావతారముగ మనకడకు దిగివచ్చునటుల శాసింపగలడు. అంతట యాఈశ్వరావతారమునుండి కరుణవెల్లువలైప్రవహించి మనల నావరించును. ఈవిషయమును మాటలతో సంపూర్ణముగ వివరించి స్పష్టపఱచుట సాధ్యముకానిపని. ఆధ్యాత్మదృష్టితో చూచి అనుభవింపదగిన యధార్ధమిది! దీనినిగూర్చి సంశయ నివారణ కావలయుననువారు భగవంతుని చూడవలసినదే. నాదృశ్యములచేత ఈఅంశమును లీలగామాత్రమే సూచన చేయగలము. ఒకడు ఆవుయొక్క కొమ్మునో, పాదములనో తోకనోలేకపొదుగునో తాకునుఅనిఅనుకొనుడు. అటులచేయుట యాఆవునే తాకుటయందుముగదా? మనుష్యులమగు మనకు పాలుస్రవించు పొదుగు ఆవునందు ప్రధానముగతోచవచ్చును. కావున ఈశ్వరకృపయనుక్షీరము భగవదవతారమునుండి మనకు లభించును అనెదము.

150. భగవంతునిగూర్చి పూర్ణముగ ఎవడు యెఱుంగజాలును? వానిని సంపూర్ణముగ తెలిసికొనుట మనకుశక్యము కాదు. అటులతెలిసికొను నిర్భంధమునులేదు. వానినిచూచిన చాలును. ఆతడుమాత్రమే సత్యముఅను అనుభవజ్ఞానమును పొందినజాలును.

151. ఒకడు శ్రీగంగానదికివచ్చి దాని నీటిని తాకుననుకొనుడు. అతడు "నేను గోముఖినుండి గంగాసాగరమువఱకును