పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41

4వ అధ్యాయము.

తెలుసుకొనకోరిరి. మొదటివాడు గోడపైకిచేరగానే "ఆహా! ఆహాహా!!" అనుచునవ్వి, లోనికిదుమికినాడు. రెండవవాడును పైకెక్కగానే పకపకనవ్వి లోపలికిదుమికినాడు. మూడవవాడుసయితము అటులనేచేసినాడు. చివరవాడగు నాల్గవమనుష్యుడు గోడపైకియెక్కినప్పుడు వానికందు రకరకములగు మధురపలములతోనిండిన మనోహరములగు పండ్లచెట్ల తోపులు కానవచ్చినవి.

తక్షణమే లోనికిదుమికి వానిని ఆరగించి ఆనందానుభవమునుపొందుటకు గాఢమగుకోర్కెపుట్టినది. కాని అతడా కౌతుకమును చిక్కబట్టి నిచ్చెనమీదుగాక్రిందికి దిగివచ్చి, తాగాంచినవనసౌభాగ్యమును అందలివృత్తాంతములను అభివర్ణించి యితరులకు భోధింపసాగెను. ఈగోడచే మూయగట్టబడిన తోటవంటివాడు బ్రహ్మము. వానిని పొడగాంచినవారెల్ల పరవశముపొంది, వానిలో లీనమగుతమకముతో తటాలున ఆబ్రహ్మమునందు దుముకుదురు. మహాసిద్ధులును, మౌనివర్యులును, అటువంటివారు. కొందఱు బ్రహ్మమును ప్రత్యక్షముచేసుకొనియు తమ అపరోక్షాను భూతిని ఇతరులకుపంచియిచ్చు కుతూహలముకలవారగుదురు. నిర్వాణసుఖమునుపొందు తమఅవకాశమును త్యాగముచేతురు. సంసారసాగరమునబడి కొట్టుకొనుచుగతికానకయున్న మానవజాతికి పరమపదవింగూర్చిన బోధలుచేసి దారిజూపుకొరకై యీప్రపంచమున అవతారములు దాల్చుదురు.