పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

40

ష్ణాదిఅవతారపురుషులస్వరూపములు ద్వివిధములుగానుండును. అందఱికిని తెలియవచ్చు సామాన్యమానవులనుబోలుబాహ్య ప్రకాశరూపము ఒకటి. సర్వకర్మాతీతమై, ఆంతరంగిక పరమశాంతితోడనొప్పు ఆత్మరూపము మఱొకటియుండును.

132. అవతారమనునది ఎల్లెడలను ఒక్కటియే; భేదములేదు. జీవసాగరమునందు ఏకోనారాయణుడు ఒకతావున కృష్ణరూపమున పైకితేలి కాన్పించును. మఱలముణిగి వేఱొక తావున క్రీస్తురూపమున తేలిప్రత్యక్షమగును.

133. సాధారణఋతువులయందు నూతులలోనినీరు చాల లోతుననుండి కష్టముమీదగాని చిక్కదు. వానకాలమునందు దేశమంతయు వఱదలుపాఱునప్పుడు ఎక్కడపట్టిన అక్కడ నీరులభించును. అటులనే సాధారణముగ భగవంతుఁడు, జపతపవ్రతములను ఎన్నిటినోచేసినగాని, ప్రత్యక్షము కాడు. కాని, అవతారమనెడివఱద భూలోకమునునిండినప్పుడు భగవంతుడు ఎల్లెడలదర్శనీయుడగును.

134. "ఈశరీరమును తాల్చుటలో నేనుగావించిన త్యాగమును, నేనుభరించు లోకభారమును ఎవరు తెలియజాలుదురు?" అని భగవాన్‌శ్రీరామకృష్ణపరమహంసులవారు పలికిరి. భగవంతుడు భౌతికశరీరమును తాల్చునప్పుడు ఎంతటిత్యాగము చేసియుండునో ఎవనికిని గ్రాహ్యముకాదు.

135. ఒకస్థలముచుట్టును చాలఎత్తగుగోడయున్నది. వెలుపలివారికి అదెటువంటితావోతెలియదు. ఒకతడవ నలుగురు మనుష్యులు నిచ్చనవేసికొని గోడనెక్కిలోపలనేమియుండునో