పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4వ అధ్యాయము.

భగవదవతారములు.

127. మహాసముద్రమునందు అలలెటువంటివో, బ్రహ్మమునందు (శ్రీరామకృష్ణాది) అవతారములు అటువంటివి.

128. సచ్చిదానందమహావృక్షమున, రాములు, కృష్ణులు, బుద్ధులు, క్రీస్తులు, మున్నగువార లనేకులు గుత్తులుగుత్తులుగా వ్రేలాడుచుందురు. వీనిలోనుండి అప్పుడప్పుడు ఒకరో ఇద్దరో ఈలోకమునకు దిగివచ్చి మహాపరివర్తనములను విప్లవములను నడుపుచుందురు.

129. భగవాన్‌రామచంద్రుడు ఈలోకమున అవతరించినప్పుడు ఏడుగురుఋషులుమాత్రమే వానిని భగవదవతారమని తెలియగలిగిరి. అటులనే భగవంతుడీలోకమున అవతరించునప్పుడు ఏకొలదిమందిమాత్రమో వానిదివ్యత్వమును గ్రహింపగల్గుదురు.

130. దీపముతనచుట్టునుండువస్తువులను, ప్రకాశింపజేయుచుండగా ఎల్లప్పుడును ఆదీపముక్రిందమాత్రము నీడయుండనే యుండును. అట్లే ప్రవక్తలకు అత్యంతసమీపవాసులై మెలగువారు వారినిపాటింపరు. దూరమునున్నవారే ఆమహాత్ముల ప్రకాశమును అద్భుతమహిమను ఆకర్షించి ఆశ్చర్యపడుచుందురు.

131. వెలుపలికికాన్పించుకోఱలు, లోపలనుండుదంతములు అని ఏనుగుపండ్లు రెండురకములుగానుండును. ఆతీరుననే శ్రీకృ