పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

397

41వ అధ్యాయము.

యెడల సర్వజనులును అటుల చేసియుండెడివారలే! అయినను ప్రతివారును చేయలేరు! ఎట్లు? మీకాయనయిచ్చు బలమునంతను సద్వినియోగము చేయునెడలనే మీకాయన హెచ్చుగ నిచ్చుచుండును. అందుకై స్వయంకృషి అత్యవసరము. కాబట్టి ఈశ్వరకృపకు పాత్రులగుటకును మనము చాల పరిశ్రమచేయవలసియున్నది. అట్టిపరిశ్రమయున్నప్పుడు ఈశ్వరకరుణవలన అనేకజన్మలకష్టము ఒక్కజన్మలో తీరగలదు. కొంతైన స్వయంకృషి ఉండియే తీరవలయును. ఒక కథ చెప్పెద వినుడు:-

"గోలాకాధిపతియగు విష్ణువు నారదుని ఒకసారి నరకమున పడిపోదువుగాక అని శపించెను. అందుకై నారదుడు మదిలో చాల తహతహపడెను. అంతట కీర్తనల పాడుచు స్తోత్రములచేయుచు నరకము ఎచ్చటనుండునో, తానచ్చటికి ఎటులపోవుటో తెలుపుమని భగవంతుని వేడుకొనసాగెను. అప్పుడు విష్ణువు నేలమీద విశ్వముయొక్క పటమును గీసి స్వర్గనరకములను దానిలో సూచించినాడు. అంతట నారదుడు నరకము అని చూపబడిన తావునుచూపి "ఇదేనా ఇదేనా నరకము?" అని అడిగెను. అట్లు ప్రశ్నించుచు ఆతావున పడిదొర్లి "స్వామీ! నేను నరకబాధలు పడి నాశిక్షను అనుభవించివేసితిని" అనెను. "అదెట్లు?" అని విష్ణువు అడుగగా నారదుదు "ఏమిస్వామీ! స్వర్గనరకములు నీవు సృష్టించినవి కావా? నీవే యీపటమును రచించితివి. అందు నరకమును చూపించితివి. అది నిజముగా నరకమే