పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

396

పంచదార తినవద్దనునుగదా! తానుతినుచున్నాడే!" అనుకొని యుండును. అనిసమాధానము చెప్పెను.

1003. జీవుని స్వాతంత్ర్యమునకును ఈశ్వరుని కృపకును సమన్వయము కుదరక ఇరువురు శిష్యులు తమ సమస్యను పరిష్కరింపుడని శ్రీరామకృష్ణపరమహంసులవారి కడకు పోయిరి. శ్రీవారు "స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యము అని మీప్రసంగమేమిటి? సర్వమును ఈశ్వరేచ్ఛపై నాధారపడి యుండును. మనఇచ్ఛ ఈశ్వరేచ్ఛతో ఆవు గుంజకు కట్టబడినటుల బంధింపబడియున్నది. మనకు కొంత స్వతంత్రత యున్నమాట నిజమే; అది ఒక నిర్ణీతవలయములోపలనే! కావున నరుడు స్వతంత్రుడ ననుకొనుచుండును. కాని వాని యిచ్చ ఈశ్వరేచ్ఛకు లోబడియుండునదే యని గ్రహించుడు!" అనిరి.

"అటులగునెడల జపతపముల సాధనలు అవసరముండవా? ఏలయన, అంతయు ఈశ్వరేచ్ఛయే! అని ప్రతివాడును అనవచ్చును. ఏదిజరిగినను వానియిచ్ఛవలన జరిగినదే అనవచ్చును" అని శంకించిరి.

పరమహంసులవారిట్లనిరి:- "ఓహో! ఎంతవఱకామాట? ఊరక నీవు నోటిమాటతోఅనిన చాలునా? నీవు రక్కిసకంపమీద చేయివేసి మాటలతో ఏమియులేదు లేదనిన ముండ్లు గ్రుచ్చుకొనక విడుచునా? పారమార్థిక సాధనలచేయుట నరుని స్వాధీనములోనె పూర్తిగాయున్న