పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

395

41వ అధ్యాయము.

1001. ఒక శ్రీమంతుని సేవకుడు యజమానియింటికివచ్చి వినయవిధేయతలతో ఒకమూల నొదిగి నిలువబడెను. వాని చేతిలో గుడ్డతో కప్పినదేమొయుండెను. యజమాని "ఓరీ! ఆ నీచేతిలోనిది ఏమి?" అని ప్రశ్నించెను. అంత నాసేవకుడు తన గుడ్డలోనున్న ఒక వెలగపండునుదీసి, కడునమ్రతతో యజమానునిముందుబెట్టి, దానిని యజమానుడు రుచిచూచు నెడల తాను కృతార్ధుడనగుదునని ఉవ్విళ్లూరుచుండెను. యజమానుడు సేవకుని వినయవర్తనమునకుమెచ్చి, ఆతడు తెచ్చిన స్వల్పపుకానుకనైనను ఆదరమొప్పగ్రహించి "ఆహా! ఈఫలము ఎంతసువాసన గొట్టుచున్నది! ఎక్కడినుండి దీనిని సంపాదించితివి?" అనుచు ఎంతయో ఆనందించెను.

ఈతీరుననే భగవంతుడు భక్తుల హృదయములను పాటించును. వాని ఐశ్వర్యము అనంతమై వెలయునదైనను భక్తిశ్రద్ధలకు భగవంతుడు వశుడగుచుండును.

1002. ఒకడు రోగముతోనున్న తన చిన్నబిడ్డను చేతుల నెత్తుకొని ఒకసాధువుకడకు ఔషధముకొఱకై వెళ్లెను. ఆసాధువు మరునాడు రమ్మనెను. మరునాడు రాగా "నీబిడ్డకు తీపిపదార్థములు పెట్టకుము. వానిరోగముకుదురును." అని చెప్పెను. అంత నామనుష్యుడు "అయ్యా! ఈమాటను నిన్న సాయంతనమే చెప్పి యుండవచ్చునే!" అనెను. "అవును, కాని నిన్ననాయెదుటనే పంచదార కనబడుచున్నది. దానిని చూచినచో నీబిడ్డడు ఈసాధువుకపట వేషదారి. ఆయన నన్ను