పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

393

41వ అధ్యాయము.

999. ఆత్మవిచారము చేయుచుపోగా, మనసుపూర్ణశాంతినిపొందినప్పుడు బ్రహ్మ సాక్షాత్కారమగును.

ఒకడు రాజును చూడనెంచెను. సప్తద్వారములకు లోపల అంతఃపురమున రాజుండెను. ఆమనుష్యుడు మొదటి ద్వారముకడకువచ్చి, అక్కడ డంబముగా దుస్తులు ధరించి చుట్టును భటులతోకూడియున్న యొకనిని చూచెను. రాజు దర్శనార్ధముపోయినవాడు తన స్నేహితునితో "ఈతడేనా రాజు?" అనగా స్నేహితుడునవ్వి కాదనెను. తరువాత నతడు రెండవ, మూడవ, నాలుగవ ద్వారములదాటి పోవుచు అందందు హెచ్చుహెచ్చుగా డంబపు వేషములతో నుండువారిని కాంచెను. ఆతడు లోనికేగినకొలదిని ఆడంబరము హెచ్చిపోవుచున్నది. ప్రతిద్వారముచెంతను అతడు రాజు కనబడెననితలచి తన స్నేహితుని ప్రశ్నించుచు వచ్చెను. కాని ఆతడు ఏడవద్వారము దాటి రాజును ముఖాముఖిని చూచినప్పుడిక రాజెవరని స్నేహితుని అడుగనక్కరలేకపోయినది. అనంతైశ్వర్యముతో దేదీప్యమానముగ తేజరిలుచున్న రాజునుకాంచగనే తాను జననాధునియెదుట నిలువబడి యున్నటుల వానికి సహజముగనే తెలిసినది.

1000. పెద్దపులియొకటి గొఱ్ఱెలమందపై బడినది. అది సూడిపులిగాన ఎగురుటతోడనే యీనిచచ్చి పడినది. పులికూన మాత్రము ఎటోబ్రతికి గొఱ్ఱెలలో కలిసి పెరిగినది. గొఱ్ఱెలు పొలములో మేతమేయుచుండ అదియు మేతమేయ నేర్చు