పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

388

న్నియో అవసరములువచ్చి నిరంతరముడబ్బునకై యాచించుచు నుండవలసినవారైపోయిరి!

994. ఒకనాడొక పల్లెవాడు రాత్రివేళ ఒక పెద్దమనుష్యుని తోటలో ప్రవేశించి కోనేటిలో చేపలుపట్ట సాగెను. యజమానునికి ఆసంగతితెలిసి తోటచుట్టును తనసేవకుల నునిచి, కాగడాలు పట్టించుకొని దొంగనుపట్టుకొనుటకై తోటలోనికి వచ్చెను. ఇంతలో నాపల్లెవాడు తప్పించుకొనిపోవుతెరవు గానక ఒడలెల్ల బూడిదపూసుకొని, సాధురూపమున ఒక చెట్టుక్రింద కూర్చుండెను. ధ్యానమున మునిగినవానివలె నటించెను. మరుచటి ఉదయాన ఆతోటలోనికొక మహాత్ముడు వచ్చియున్నాడని ఊరెల్ల చెప్పుకొనసాగిరి. కాబట్టి వందలు కొలదిప్రజలు పండ్లుపూవులు కొల్లగదెచ్చి సాష్టాంగపడి సాధుపూజల సాగించిరి. వానియెదుట వెండి బంగారునాణెములు కుప్పలుకుప్పలుగాపడినవి. అప్పుడాపల్లెవాడు "ఆహా! ఏమిచిత్రము! నిజముగా నేను సాధువునుకాను. అయినను వీరలు నన్నింతగా పూజించుచున్నారు. నేను నిజముగా సాధువునే అయిపోయినయెడల నాకు భగవంతుడే జిక్కగలడు!" అని తలపోసెను. ఈరీతిగా బూటకపు నటన ఆపల్లెవానిమనస్సున జ్ఞాన ప్రబోధము కలిగించినది!

995. ఒకానొక సాధువునకు గొప్ప మహిమలు అలవడినవి. వానిగురించి అతడు మహాగర్వియైనాడు. అయినను ఆసాధువు చాలమంచివాడు; తపశ్శాలియు నై యుండెను. వానికి బుద్ధిగఱపనెంచి భగవంతుడు సన్యాసి వేషము దాల్చి వానిచెంతకువచ్చి "అయ్యా! మీరు మహామహిమ