పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

386

దాపునకుపోగా ఆమె ముద్దులొలుకు పలుకులతో నారదుని పలుకరించినది. వెంటనే ఒకరినొకరు ప్రేమించిరి. అచ్చోటున నారదుడామెతో కాపురముచేయుచు నిలచిపోయెను. కాలక్రమమున వారికి సంతానము కలిగినది. ఇట్లు నారదుడు ఆలుబిడ్డలతో మహానందముగ కాలముగడుపుచుండగా ఆదేశములో మహామారిజాడ్యము ప్రవేశించినది. అనేకులు ఆరోగముచే మృతినొందుచుండిరి. ఆచోటు విడిచిపోవుటకు నారదుడు తలపెట్టి భార్యతోచెప్పినాడు. ఆమెయుసరేయనగా వారుబిడ్డలను చేతులుపట్టుకొని నడిపించుచు ఇల్లువిడిచి పయనమాయిరి. వారొకవంతెనమీదుగా బోవుచుండ హఠాత్తుగా వరదవచ్చి నీరుపైకుబికినది. ఒక్కొక్కరేపిల్లలు ప్రవాహవేగమున కొట్టికొనిపోయిరి. తుదకు భార్యయు నీటమునిగిపోయినది. దుఃఖావేశమునమునిగి నారదుడు ఒడ్డునఏడ్చుచు కూర్చుండెను. ఆసమయమున శ్రీహరి సమీపించి "ఓనారదా! మంచినీరేది? నీవిటులఏడ్చుచున్నావెందులకు?" అనిరి. స్వామిదర్శనముకాగానే నారదుడు దద్దఱిలిలేచెను. అంతట వానికి సర్వమును తెల్లమైనది. "ప్రభో! నీకు నమస్కారసహస్రమర్పించెద నీవిచిత్రమాయకు కోటినమస్కారములు అర్పించువాడ" నని నారదుడు పలికెను.

992. గోపాలునిగూర్చి యొకప్పుడు వర్తమానమేమియు తెలియనందున యశోదాదేవి రాధకడకువచ్చి ఆమెకేమైన గోపాలుని వర్తమానముతెలియునా యని అడిగినది. ఆసమయమున రాధ మూర్ఛిల్లియున్నది. యశోదవచనములామె విననేలేదు. కొంతసేపటికి మూర్ఛదేఱిచూడగా నందరాణి