పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

384

కను అబ్బురము గొలిపెను. అట్లెందుకు నిశ్చలముగకూర్చుంటివని ఆయన కొమారుని ప్రశ్నింపగా, ఆ కుమారుడునవ్వి యిట్లనెను: "పాముఏది? ఎవరిని కఱచినది?" ఆతడు అద్వైతసిద్ధిని పడసినవాడు. కావునపామని నరుడని భేదభావమును దఱిరానీయడయ్యెను.

989. ఒకసారి చాకలియొకడు ఒక భక్తుని పట్టుకొని కొట్టుచుండ, ఆభక్తుడు "నారాయణ నారాయణ" అని మాత్రము పలుకసాగెను. స్వామి నారాయణుడు వైకుంఠపురములో లక్ష్మీదేవిసమీపమున కూర్చుండియుండెను. భగవానునికి వీనిమొఱవినరాగానే తటాలునలేచి వానిని రక్షించు నిమిత్తము ఆచోటునకు పోనెంచెను. కాని రెండుఅడుగులు పోయి మరలివచ్చి కూర్చుండెను. దీనిని కనిపెట్టిన లక్ష్మీదేవి భగవంతుడు అటుల వెంటనే వచ్చివేయుటకు కారణమేమని అడిగినది. స్వామినారాయణుడిటుల చెప్పినాడు: "నేను ఆ తావునకుపోవలసినఅగత్యము కానరాలేదు. ఆభక్తుడుకూడ చాకలివాడైపోయినాడు. ఆతడు తన సంరక్షకుడు తానయై నిలచినాడు; ఏలన తనను కొట్టుచున్న వానిని తిరిగి కొట్టసాగినాడు కావున నేను అక్కడికి పోవలసిన ఆవశ్యకత యేమున్నది?" చూచితిరా, భగవంతుడుతనకుపూర్ణముగ స్వార్పణచేసికొనినవానినితప్ప రక్షించబూనడు.

990. అర్చకకులమునకు సంబంధించిన యొక కథను శ్రీపరమహంసులవారు చెప్పుచుండెడివారు. శ్రీగౌరాంగదేవుడు (శ్రీ చైతన్యులు) భావసమాధిలోనుండి మైమఱచి సముద్రమున