పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

383

41వ అధ్యాయము.

ఇప్పుడో నీవే నన్ను చంపుచుండగా ఇంక నెవరినిగురించి నేను మొఱలిడగలను?" అని జవాబు చెప్పినది.

987. పతివ్రతయు భక్తాగ్రేసరియు నగు ఒకానొక స్త్రీ భర్తతో కాపురముచేయుచు, బిడ్డలను ప్రేమతో చూచుచును తనహృదయమును భగవంతునిపై స్థిరముగా నిలిపియుంచెడిది. ఆమె భర్తమృతిచెందగా చేతులనున్న గాజులను బగులగొట్టివేసి వానికిమారుగా బంగారుకంకణములను ధరించినది. ప్రజలు ఆమె విపరీతచర్యను గురించి ఆశ్చర్యపడసాగిరి. అప్పుడామె యిటుల సమాధానముచెప్పినది:_ "ఇంతవఱకును నాభర్తశరీరము గాజులవలె అల్పబలముగలదై పెళుసుగ నుండెను. ఆ అశాశ్వతతనువు పోయినది. ఆయన యిప్పుడు నిర్వికారుడై సర్వవిధముల సుస్థిరుడై యున్నాడు. వానిశరీరము ఇప్పుడు ఓటికుండగాదు. కావున నేను ఓడోడుగానుండు గాజులను దీసివేసి స్థిరతరస్వభావముగల ఆభరణములను ధరించుచున్నాను."

988. ఒకపర్యాయము ఇద్దరుసాధువులు దక్షిణేశ్వరమునకు వచ్చిరి. వారు తండ్రికొమరులు. కొమారుడు జ్ఞానసిద్ధిని పడసినాడు; తండ్రికింకను సిద్ధి యలవడలేదు. ఇరువురును శ్రీరామకృష్ణపరమహంసుల వారుండు గదిలోకూర్చుండి శ్రీ వారితో ప్రసగించుచుండిరి. ఇంతలో ఒక ఎలుకకన్నములోనుండి త్రాచుపామువచ్చి కొమారుని కఱచినది. అదిచూచి తండ్రి భీతిలిపోయి చుట్టునున్నవారినందఱిని పిలువసాగెను. కాని కుమారుడు కదలక కూర్చుండియుండెను; ఇది వానితండ్రికిం