పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

382

అని కేకలు వేసినాడు. అయినను వాయుదేవుడు వినిపించుకొనలేదు. అంతట "ఓదేవా! ఈగుడిసె హనుమంతునిస్వామియగు శ్రీరామచంద్రునిది" అని అఱచినాడు. అప్పుడును వాయువు లక్ష్యముచేయలేదు. పిమ్మట ఆగుడిసె తలక్రిందై పోవుచుంట కనిపెట్టి తన ప్రాణరక్షణార్థమై బయటికి వచ్చివేసి, అతడు "ఈముష్టిగుడిసె ధ్వంసమైపోనీ! నాకేమి?" అనినాడు.

మీరిప్పుడు కేశవునిపేరు నిలుపుటకు ఆతురపడుచున్నారు; అయినను, భగవదేచ్ఛయుండుటంజేసి ఆ పవిత్రోద్యమము కేశవునిపేర బయలువెడలినదనియు, ఆ యుద్యమము అంతరించునేని అదియు భగవత్సంకల్పము చేతనే జరుగుననియు జ్ఞప్తినుంచుకొనుడు; శాంతిపడుడు. కాబట్టిమీరు అమృతసాగరమున నిమగ్నులగుటకు ఆయత్తపడుడు."

986. అడవులలో తిరుగుచుండగా శ్రీరామచంద్రుడు తన విల్లంబులను నేలలోగ్రుచ్చి, సంసారసరస్సులోనికి నీరుత్రాగ దిగినాడు. వానివిల్లు గ్రుచ్చుకొనుటచేత ఒడలంతయు నెత్తుటితో నున్న కప్పయొకటి, ఆయన తిరిగివచ్చినప్పుడు కంటబడినది. ఆయన విచారపడి "నీవెందుచేత ఏదోరీతిగా అరవవైతివి? అప్పుడు నీవిక్కడనుంటివని గ్రహించి నీకీ దుఃఖపాటును కల్పించి యుండెడివాడను కానే!" అని కప్పతో ననెను. అందుకాకప్ప "ఓరామా! నాకపాయము సంభవించినప్పుడు 'ఓరామా! రక్షింపుము' అనినిన్నువేడుకొనుచుందును.