పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

378

చున్న సాలె పట్టుపడెను. ఆరాత్రి ఆతడు చెఱసాలలో గడుపవలసివచ్చినది. మరునాటిఉదయము న్యాయాధికారి ఎదుట విచారణకై అతడు తీసికొని రాబడెను. గ్రామస్థులందఱు ఆవార్తవిని సాలెవానిని చూడవచ్చిరి. వారందఱును ఒక్కమాటగా "ప్రభూ! ఈమనుష్యుడు దొంగపని చేసి యుండడు." అని యేకగ్రీవముగా చెప్పిరి. న్యాయాధిపతి జరిగినదేమొ చెప్పుమని సాలెవానిని అడిగెను. అంతట సాలె యిట్లుమనవిచేయసాగెను:- "ప్రభూ! రాముని యిచ్ఛవలన నేను చావడిలో కూర్చున్నాను; రామేచ్ఛవలన రాత్రి చాలప్రొద్దుపోయినది; రామేచ్ఛవలన నేను భగవధ్యానము చేయుచుంటిని; రామేచ్ఛవలన హరినామస్మరణచేసితిని; రామేచ్ఛవలన దొంగాలావైపుగ వచ్చిరి; రామేచ్ఛవలన వరునన్ను తమతో ఈడ్చుకొనిపోయిరి; రామేచ్ఛవలన వారు ఒకయింటిలో కన్నమువేసి దూరిరి; రామేచ్ఛవలన వారుదొంగిలినసొత్తును కొంత నానెత్తినబెట్టిరి. రామేచ్ఛవలన నేను పట్టుబడితిని. రామేచ్ఛవలన నన్ను చెఱలో నుంచిరి; రామేచ్ఛవలన మీయెదుట నేను విచారణకు నిలుపబడితిని; న్యాయాధిపతి వాని నిష్కాపట్యమును పారమార్ధికతనుచూచి నిర్దోషియని విడిచివేసెను. ఆతడు బయటికి వచ్చి "రామేచ్ఛవలన నిర్దోషినైతిని" అనెను. నీవు సంసారివిగా నుండుము.; లేదా సన్యాసిగా నుండుము. అంతయు రామేచ్ఛవలననే జరుగును. బాధ్యతనంతను భగవంతునిపై నిడి కర్తవ్యకార్యములను నీవుచేయుము.