పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

377

41వ అధ్యాయము.

మొదటియోగిభక్తుడు; పసివానినిబోలు విశ్వాసముకలవాడు. భగవంతునికి అసాధ్యమనునదిలేదు. ఆయన మహిమను ఎవడుపూర్ణముగ గ్రహించినాడు? భగవంతునిగూర్చి ఏమైనను పలుకవచ్చును!

982. ఒకానొక పల్లెలో సాలెయతడొకడుండెను. ఆతడు పరమార్థ చింతకలవాడు. ప్రతివారును అతనిని విశ్వసించి ప్రేమించెడివారు. ఆసాలె తాను నేసిన వస్త్రములను అమ్ముటకై బజారునకు పోయేవాడు. ఎవరేని బేరమడిగినయెడల "రామేచ్ఛవలన నూలుకరీదు ఒక్కరూపాయి. రామేచ్ఛవలన కూలి పావలా రామేచ్ఛవలన లాభము బేడ. రామేచ్ఛవలన ఈగుడ్డకరీదిప్పుడు రూపాయి ఆరణాలు" అనేవాడు. ఆతడెంత వెలచెప్పినను ప్రజలు ఆవెలనిచ్చి కొనుచు అతనియెడ కడువిశ్వాసముతో నుండిరి. ఆతడును గొప్పభక్తుడు. రాత్రులందు భోజనానంతరము ధ్యానముమీదకూర్చుండి భగవన్నామస్మరణ చేయుచుండును.

ఒకదినమున రాత్రిచాల ప్రొద్దుపోయినది; వానికి నిద్దురపట్టలేదు. చావడిలో ద్వారముకడ కూర్చుండి పొగద్రావుచుండెను. ఒకజట్టుదొంగలు ఆత్రోవను పోవుచుండిరి. వారికొక మోతగాడు కావలసియుండెను. వారీసాలెవానిని చూచి తమతో లాగికొనిపోయిరి. వారొకయింటిలో చొరబడి చాల సొత్తును మ్రుచ్చిలిరి. దానిలోకొంత ఈసాలెవాని నెత్తినబెట్టి మోయుమనిరి. ఇంతలో కావలివాడా వైపునకు రాగా దొంగలు పారిపోయిరి. నెత్తిని దొంగసొత్తు మోయు