పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

375

41వ అధ్యాయము.

సత్యమగు భక్తియొక్కయు, నిష్ఠయొక్కయు మహత్తు అటువంటిదిగ నుండును!

980. ఒకమనుష్యుడు అడవులగుండ ప్రయాణముచేయుచుండెను. త్రోవలో ముగ్గురుదొంగలు వానిని ముట్టడించిరి. వానికడ కాన్పించినదానినెల్ల వారు ద్రోచుకొని పోయిరి. అంతట నొకదొంగ "ఈమనిషిని జీవముతో విడిచిన లాభమేమున్నది?" అనుచు కత్తిదూసి వానిని చంపబోయెను. ఇంతలో మఱొకడు వానిని ఆపి, "వీనిని చంపినందువలన లాభమేమున్నది? చేతులు కాళ్లు కట్టివేసి ఒకప్రక్కను పడవేసి పోవుదము" అనెను. అంతట వారాతనిని కాళ్లుసేతులు బంధించి, త్రోవప్రక్కగా పడవేసిపోయిరి. వారు వెడలిపోయినకొంతసేపటికి మూడవదొంగ తిరిగివచ్చి "అయ్యో! నీకుబాధకలిగినదా? నీబంధనములు విప్పి నిన్ను విడుదలచేతును" అని కట్లువిప్పివేసెను. మఱియు "నాతోడరమ్ము; నీకు త్రోవచూపిపోదును" అనెను. వారటుల చాలదూరము కలసిపోగా మార్గముకాన్పించినది. అప్పుడాదొంగ "అదిగో! నీయిల్లు! ఈత్రోవనుపొమ్ము; నీయిల్లుచేరుదువు" అనెను. అంతట ఆమనుష్యుడు "అయ్యా! నీవు నాకు చాల ఉపకారముచేసినావు. నేను సదాకృతజ్ఞుడనై యుందును. నీవు నాతోకూడ మాయింటికిరావా!" అనెను. దొంగవాడాతనితో "వల్లపడదు. నేను అక్కడికి రాజాలను. పోలీసువారు నన్ను పట్టుకొనగలరు అని పలికెను. ఈసంసారమే అడివి. ప్రకృతి గుణములగు సత్వరజస్తమో గుణములే మువ్వు