పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

353

41వ అధ్యాయము.

వారైరి. ఆవర్తకుడు దయదలచి వారిని ఒకగదిలో పండుకొననిచ్చెను. ఆగదియందు మరునాడు అమ్ముకొనునిమిత్తం చేర్చిపెట్టిన సువాసనగల పూలగంపలుండెను. ఆపూలవలన వచ్చు కమ్మనివాసనలు గాలినిండగా, ఆపల్లెవనితలు భరించ లేకుండిరి. వారికి కునుకుపట్టదయ్యెను. అప్పుడు వారిలో నొకతె "ప్రతివారును తమచేపలబుట్టలను ముక్కులకు దాపుగా పెట్టుకొనుడు. ఇక ఈపూలకంపు మనలను బాధించదు. మనము చక్కగనిదురించగలము" అని యుపాయము చెప్పెను. వారందఱును ఆమె యుపాయమునకుమెచ్చి ఆమె చెప్పినటుల చేసిరి. క్షణములో పాటికి నిదురపట్టినది; ఎల్లరును గుఱ్ఱువెట్ట సాగిరి. అభ్యాసముయొక్క బలమును మహిమయు అటులుండును. ఐహికవ్యాపారతత్పరులు విషయ చింతలకు భోగవాంఛలకును మరగినవారై భక్తివైరాగ్య వాతావరణమును సహించలేరు; ఉబ్బుగుడుచుకొనితబ్బిబ్బులగుదురు.

962. ఒకయోగి త్రోవప్రక్కను సమాధియవస్థలో నిమగ్నమైపడియుండెను. ఒక దొంగవాడాత్రోవను పోవుచు వానిని చూచి "వీడు దొంగవాడైయుండును. రాత్రి కొన్ని యిండ్లుదోచి అలసటతో యిట్లుపడి నిదురబోవుచున్నాడు. పోలీసువారువచ్చి త్వరలోనె వీనిని పట్టుకొనగలరు. నేను పారిపోవుట మంచిది" అని తనలో తాననుకొనెను. ఇట్లు భావనచేసి వెడలిపోయెను. ఇంతలో ఒక త్రాగుబోతువచ్చి యిట్లు పలుకసాగెను. "ఓహో! వీడు ముంత ఎక్కువేవేసి