పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

352

960. నలుగురు గ్రుడ్డివాండ్రు ఏనుగును చూడబోయిరి. ఒకడు ఏనుగు కాలును తడవిచూచి అది స్తంభమువలె నుండుననుకొనును. రెండవవాడుదానితొండమునుతాకిచూచి అది కొండచిలువవలె నుండెననితలచెను. మూడవయతడు దానిపొట్టను స్పర్శించి పెద్దపీపావలెనుండునని యూహించెను. నాలుగవవాడుదానిచెవులనునివిరిచూచి పెద్దచేటనుపోలియుండునని యెంచెను. తుదకు ఏనుగుస్వరూపమును గురించి తమలోతాము వివాదపడసాగిరి. దారిపోవు నాతడొకడు "మీరు వివాదపడు విషయమేమిటి?" అని అడిగెను. వారు తమ వృత్తాంతమును తెలిపి మధ్యవర్తిగా నుండి న్యాయము చెప్పమనిరి. ఆమనుష్యుడిట్లనెను:- "మీలో నెవరును ఏనుగును చూచియుండలేదు. ఏనుగు స్తంభమువలె నుండదు; దాని కాళ్లు స్తంభమును పోలియుండును. ఏనుగు చేటనుపోలియుండదు; దానిచెవులు చేటలవలె నుండును. దానితొండము పెద్దచిలువవలె నుండును; దానిపొట్ట బుట్టవడువున నుండును. ఏనుగుఅనగా దానికాళ్లు పొట్ట చెవులు తొండముచేరినఆకారమగును." ఇదేవిధముగా భగవంతుని ఒక్క కళనుమాత్రము ప్రత్యక్షముచేసికొనిన వారు తమలో తాము వివాదపడుచుండుదురు.

961. పల్లెవనితలు కొందఱు తమగ్రామమునకు దూరముగనున్న సంతకుపోయి, సాయంతనము మరలిపోవుచుండగా గాలివాన వచ్చినది; చీకట్లుక్రమ్మినవి. నడకసాగక దాపుననున్న ఒక పూలవర్తకునియింట తలదాచుకొనవలసిన