పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

2వ అధ్యాయము.

తులు బ్రహ్మమని వ్యవహరించునది ఆ నాదివ్యజవనియే, వేఱుగాదు. నిర్గుణబ్రహ్మముయొక్క సగుణభావమూర్తియే ఆమె.

88. నాదివ్యమాత ఏకమును అనేకమును అనియు, ఏకానేకమునకు అతీతమును అనియు ఏఱుంగుదురుగాక!.

89. వృత్తిరహితబ్రహ్మమును, వృత్తిసహితశక్తియు యధార్ధమునకొక్కటే, సచ్చిదానందరూపుడగు బ్రహ్మమేసర్వధారిణియు, సర్వజ్ఞయు, సర్వమంగళరూపిణియు అగుజగజ్జనని! స్వయంప్రకాశియగుమణియు దానిప్రకాశమును ఒక్కటియేగదా! ఏలనన! ప్రకాశమునువిడిచి మణిగాని, మణినివిడిచిదాని ప్రకాశమునుగాని నీవుభావనచేయనేలేవు.

90. ఎచ్చటసృష్టిస్థితిలయములను కర్మయుండునో అచ్చటశక్తి అనగాచిచ్ఛక్తియుండును. చంచలించుచున్నను,నిశ్చలముగనున్నను, నీరునీరేగదా! ఆఏకైకసచ్చిదానందబ్రహ్మమే, విశ్వసృష్టిస్థితిలయములగావించు నిత్యచిచ్ఛక్తి. ఎట్లనగా ఈప్రధాని[1] ఒకప్పుడు కదలకకూర్చుండును. ఒకప్పుడు అర్చనలుచేయుచుండును. ఇంకొకప్పుడు పనిమీదరాజప్రతినిధిని చూడబోవును. ఇన్ని సందర్భములందును యుండునది ఆఒక్కప్రధానియే; ఆసందర్భములన్నియు అతడు ధరించు వేర్వేఱుఉపాధులనవచ్చును.

  1. (కలకత్తాలో నేపాలప్రభుత్వమువారి ప్రతినిధిగానుండిన విశ్వనాధోపాధ్యయులవారిని పరమహంసులవారు ప్రధాని అనెడివారు.)