పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

348

అర్జు:- "ఏల? ఆయన యేమిచేసెను?"

బ్రాహ్మ:- "ఏమిచేసెనా? వాని దుండగముచూడు; తనకీర్తనలు, తన సంగీతముతో నాస్వామికి నిద్రలేకుండ చేయుచుండును. స్వామిసుఖము వాని కిసుమంతయు పట్టదు. వాడుసదా ప్రార్థనలుచేయుచు స్తోత్రముల పాడుచు, రేయింబవళ్లు ఈకాలము ఆకాలము అనక, స్వామికి శాంతిదోప నీడు."

అర్జు:- "రెండవయతడెవడు?"

బ్రాహ్మ :- "ఆపెంకియిల్లాలు ద్రౌపతి!"

అర్జు:- "ఆమె నేరమేమి?"

బ్రాహ్మ:- "దాని అవివేకముంగనుము; నాస్వామిసరిగా భోజనమునకై కూర్చుండువేళ, ఉచితానుచితము లరయక, బొబ్బలిడసాగినది. నాస్వామి తినబోవునన్నమునువిడిచి గబగబ కామ్యవనమునకు పర్విడి దుర్వాసుని శాపమునుండి పాండవుల రక్షింపబోయినాడు! ఇంకను దానిపొగరేమని చెప్పను. నాస్వామికి అందఱు తినగామిగిలిన ఎంగిలి అన్నము పెట్టినదట!"

అర్జు:- "మూడవవారెవరు?"

బ్రాహ్మ:- "ఆనిర్దయుడు ప్రహ్లాదుడు! వాని ఆగడము ఎంతనుకొన్నారు! జంకుగొంకు లేకుండ నాస్వామిని పిలిచి సలసలకాగుచున్న నూనెతొట్టెలో దింపినాడు. మదపుటేనుగుల పాదములక్రింద త్రొక్కించినాడు. ఇనుపస్తంభమును