పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

347

41వ అధ్యాయము.

టలో తనతో సమానులులేరని అర్జునుడు భావించెను. సర్వజ్ఞుడగు శ్రీకృష్ణభగవానుడు వాని హృద్గతభావమును గనుగొని యొకనాడు విలాసముగా తిరుగుటకై వానిని తోడ్కొని పోయెను. వారు కడుదూరముపోకమునుపే యొక బ్రాహ్మణుడు ఎండిపోయిన గడ్డిన నమలుచు కాన్పించెను. వానిమొలలో ఒక ఖడ్గము వ్రేలాడుచున్నది. వానిని చూడగనే, ఏజీవికిని హింసచేయనొల్లని "అహింసా పరమోధర్మ" యను నీమముంబూనిన పవిత్ర విష్ణుభక్తవరుడై యుండునని అర్జునుడు గ్రహించెను. గడ్డిలోను ప్రాణముండుటం జేసి పచ్చిగానుండు గడ్డినైనను అతడు తిన సహించకుండెను; కావున ఎండి ప్రాణశూన్యముగనున్న గడ్డిని మాత్రమే ఆతడు తినుచున్నాడు. అయినను ఖడ్గధారియైయున్నాడు. ఈ వైపరిత్యముంగూర్చి వింతజెందిన అర్జునుడు శ్రీకృష్ణస్వామితో "ఇదేమివింత! తుదకు గడ్డిపోచకైననుహానిచేయనొల్లని సాధుపురుషుడు, ద్వేషమూలమును మారణోపకరణమును అగు ఖడ్గమును ధరించియున్నాడు!" అనెను. "ఆతనినినీవేప్రశ్నించి తెలిసికొనుము" అని భగవానుడు పలికెను. అర్జునుడంతటబ్రాహ్మణుని సమీపించి "స్వామీ! నీ వేజీవినిహింసించబోవు! ఎండుగడ్డినితిందువు. అట్టి నీవీకఱకుకత్తిని పూనియుంటివేల?" అని అడిగినాడు. నాకు కంటబడిరేని నలుగురినిశిక్షించనెంచి దీనినిపూనియున్నాను" అని బ్రాహ్మణుడు తెలిపెను.

అర్జునుడు - "వారెవరెవరు?"

బ్రాహ్మణుడు - "మొదటివాడా నీచుడు నారదుడు"