పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

346

కాధ్వని వినరాకుండ ఘంటలను మ్రోగించుచుండెడివాడు. ఈ కారణముచేత వానికి ఘంటాకర్ణుడను పేరుప్రసిద్ధమైనది.

954. ఏమియు ఉద్యోగములేని ఒకమనుష్యుడు ఏదేని పనిని సంపాదించుమనభార్యయొక్క పోరు పడలేకుండెను. ఒకనాడు వానికుమారుడు చాలజబ్బుచేసి, వైద్యులు ఆశలు లేవనిచెప్పు స్థితిలో నుండగా ఉద్యోగము సంపాదించు నిమిత్త మామనుష్యుడు తిరుగసాగెను. ఇంతలో కొడుకు చచ్చిపోయినాడు; తండ్రి కొఱకైవెదకగా యెక్కడనుకానరాలేదు. తుదకు సాయంకాలము ప్రొద్దుక్రుంకిపోయిన పిమ్మట అతడింటికిరాగా, ప్రాణావసానకాలమున కొడుకును విడిచిపోయినాడని భార్య వానిని చివాట్లుపెట్ట మొదలిడెను. ఆయన చిరునగవుతో నిట్లనెను:- "వినండి వినండి. నే నొకసారి రాజునైనట్లును, ఏడుగురు కొడుకుల గనినట్లును, వారితో అష్టైశ్వర్యములను అనుభవించుచున్నట్లును కలను గంటిని. కాని మేల్కొనగానే వారెవరును కానరారైరి! అదొక స్వప్నము. నేను ఆనాటి ఏడుగురు కొడుకులకై ఏడ్వవలెనా? లేక యిప్పుడు చచ్చిన నీకొడుకై ఏడ్వవలెనా? చెప్పుము!" ఈ ప్రపంచానుభవమును స్వప్నముగా నెంచు నరుడు, సామాన్య నరులవలె సంసారబంధుత్వముల నమ్ముకొని, సుఖములనుగాని, దుఃఖములనుగాని పొందబోడు!

955. శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుని హృదయమున ఒకప్పుడు గర్వము ప్రవేశించినది. తన స్వామియు, మిత్రుడునైన శ్రీకృష్ణునియెడల భక్తివిశ్వాసములు చూపు