పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

345

41వ అధ్యాయము.

953. మూర్ఖతయందు ఘంటాకర్ణునివంటి వాడవు కాకుము. శివుని పూజించుచు తదితరదేవతల నందఱను ద్వేషించిన మనుజుడొక డుండెడివాడు. వానికొకనాడు శివుడు ప్రత్యక్షమై "నీవితరదేవతలను ద్వేషించునంతకాలము నేను నీయెడ ప్రీతుడనుకాను" అనిచెప్పెను. కాని ఆతడు వినడయ్యెను. కొన్ని దినములైనపిమ్మట శివుడు వానికి మరల కాన్పించెను. కాని హరిహరరూపము దాల్చి వచ్చెను; అనగా సగముభాగము శివునిరూపు, తక్కినభాగము విష్ణువుగా నుండెను. ఆనరుడు సగము సంతోషమును సగము వెగటును పొందెను. తానర్పించు నైవేద్యమును శివునిరూపుగల వైపునుంచి, విష్ణురూపున్నవైపున నేమియు పెట్టడయ్యెను. తన యిష్టదైవతమగు శివునికి ధూపమువేసి, ఆసువాసనను అనుభవించిపోవునేమొయని విష్ణునిముక్కు గట్టిగ నదిమిపట్టినాడు. అంతట "నీమూర్ఖత చక్కబడరానిది. నేనిటుల ద్వైతరూపముదాల్చి, సకలదేవతలును ఒక్కపరబ్రహ్మయొక్క వివిధ కళాప్రదర్శనములేయని నీకు నచ్చచెప్పబూనితిని. సద్బుద్ధితో నీవు గుణపాఠమును నేర్చుకొననైతివి. నీవైషమ్యబుద్ధికై నీవు దుఃఖములనుభవించవలసినదే. చిరకాలము నీవు దండనలపాలుకావలయును" అని శివుడుపలికెను. అంతట నామనుజుడు గ్రామాంతరమునకు బోయి దాగియుండెను. కాని గాఢతరవిష్ణుద్వేషమును హృదయమున రగుల్కొల్పుకొనెను. ఆయూరిపిల్లకాయలు ఆతడువినునటుల విష్ణునామముల నఱచి వానిని పీడించసాగిరి. అతడు రెండుచెవులకును రెండుగంటలను గట్టుకొని, పిల్లలు "విష్ణు విష్ణు" అనుతోడనే తన