పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

344

కాని నీవుపోయి ముందాగ్రంధమును నేర్చిరమ్ము" అనెను. అంత నాబ్రాహ్మణుడు మరలి తన త్రోవనుబట్టి "నేను భాగవతమును యెన్నిసంవత్సరములనుండియో మరల మరల పఠనము చేసియుంటినే! అట్టి నన్నీరాజు భాగవతమును బాగుగ గ్రహించని వానిక్రింద గట్టినాడు! ఎంతటి మూర్ఖుడో!" అని తలంచసాగెను. అయినను అతడు భాగవతమును మరొకసారిచదివి తిరిగి రాజునొద్దకు వెళ్లెను. రాజు మరల ఆమాటనే చెప్పి పంపివేసినాడు. బ్రాహ్మణుడుమిగుల విసుగుజెందినాడు; కాని, రాజు అటులవర్తించుటకుకరణముండియుండుననుఊహవానికి తట్టినది. ఆయనయింటికిపోయి ఒక గదిలోజేరితీవ్రబుద్ధితో భాగవతమును పఠించనారంభించెను. రానురాను అందలి రహస్యార్థములు వానిబుద్ధికి తోచనారంభించెను. ధనము, గౌరవము, రాజులు , ఆస్థానములు, సంపదలు, ఖ్యాతి, మొదలుగాగల బుద్బుదప్రాయములగు విషయముల వెంటపర్విడుసంకల్పములేబొత్తుగ వానిదృష్టినాకర్షించవయ్యెను. ఆదినముమొదలు ఆబ్రాహ్మణుడు భగవదారాధనముచేయుచు ఆత్మసాక్షాత్కారమునుబడయు నిష్ఠయందు నిలిచిపోయెను. కొన్నియేండ్లు గడచినయనంతరము రాజుబ్రాణునిగూర్చి విచారించి ఆయన యమిచేయుచుండెనో చూచుటకై వాని యింటికి వెళ్లినాడు. వానిముఖముదివ్యతేజముతో ప్రకాశవంతమైయుండుటగాంచి రాజు వానిమ్రోలసవినయముగ మోకరించి "నీవిప్పుడు భాగవతార్ధమును నిజముగాగ్రహించితిరని నాకుతెల్లమైనది. నన్ను నీవు శిష్యునిగాస్వీకరించుటకుఒడంబడితివేని సిద్ధముగనుంటిని" అని పలికెను.