పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

343

41వ అధ్యాయము.

అని భార్యపలికినది. పాపమా వర్తకుడు అప్పుడుచేయగల దేమియున్నది? గురువుగారినా? ఏదోమాయమాటలతో పంపివేయుటకు? ఈమె వాని శయ్యాగృహపు గురువయ్యె! ఈమె ఆజ్ఞలు అప్పుడప్పుడే చెల్లితీరవలయును. లేదా యింటిలోనిపోరు ఇంతంతయని వర్ణింప వీలుండదు. తుదకా వర్తకుడు విధిలేక, అర్ధరాత్రివేళపోయి కొట్టుతీసి భార్యకోరినటుల చీరలను తెచ్చినాడు. మరునాటి ఉదయమున ఆగృహిణి రెండు చీరెలను గురువు గారింటికి పంపి "ఇకమీదట మీకేమైన కావలయునేని నన్నడుగుడు; మీకు దొఱకును" అనికబురుచేసినది. కావున వరములు కోరువారు సులభముగా దాక్షిణ్యముచూపని జగజ్జనకుని అర్చించుటకన్న దయామయు జగజ్జననిని పూజించుట లెస్స!

952. బాగుగచదువుకొనిన బ్రాహ్మణుడొకడు విజ్ఞానవంతుడగు రాజునొద్దకువెళ్లి "రాజా! నేను శాస్త్రములను చక్కగచదివినపండితుడను. నేనునీకు భాగవతమును బోధింపనెంచివచ్చితిని" అనెను. ఆయిద్దరిలో బుద్ధిమంతుడైనరాజు ఎవడేని నిజముగా భాగవతమునే చక్కగా చదివియున్న యెడల అట్టివాడు తన ఆత్మనుతెలియగోరు విచారణయందు నిమగ్నుడైయుండును గాని రాజస్థానమున గౌరవమును ధనమును సంపాదించ నెంచియుండడని బాగుగ నెఱుంగును. కావున రాజాయనతో "బ్రాహ్మణవర్యా! నీవాగ్రంధమును జక్కగతెలిసికొని యుండలేదని నేను గ్రహించితిని. నేను నిన్ను నాగురువుగాచేసికొనుటకు వాగ్దానము చేయుచున్నాను;