పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

342

951. ఒక పేద బ్రాహ్మణునకు ధనికుడగు వర్తకుడు శిష్యుడుగానుండెను. ఆవర్తకుడుచాలలోభి. ఒకనాడాబ్రహ్మణునికి తన పవిత్రమైన పుస్తకమును మూట కట్టుకొనుటకు చిన్నగుడ్డముక్క కావలసివచ్చినది. ఆయన తనశిష్యునిదగ్గరకుపోయిఅడిగినాడు. వర్తకుడిట్లుపలికెను:- "అయ్యో, రెండుగడియలక్రిందజెప్పినయెడల మీకుకావలసినది ఇచ్చియుందును; నాకెంతయో విచారముగ నున్నది! మీకు పనికివచ్చెడు చిన్న గుడ్డ ముక్క యిప్పుడేదియులేదే; ఏమి దురదృష్టము! కానిండు మీరడిగిన దానిని జ్ఞప్తియందుంచుకొందును; మీరప్పుడప్పుడు జ్ఞప్తికితెచ్చుచుండుడు." పాపమా బ్రాహ్మణుడు నిరాశతో వెడలిపోయెను. గోడప్రక్కనున్న వర్తకుని భార్య యీగురుశిష్యుల సంభాషణను వినినది. ఆమె వెడలిపోవుచున్నబ్రాహ్మణుని యింటికి పిలిపించి "స్వామీ! యీ గృహ యజమానుని మీరడిగినది ఏమి?" అని విచారించినది. బ్రాహ్మణుడు జరిగిన వృత్తాంతమును వినిపించినాడు. "చిత్తము; మీరింటికివెళ్లండి. మీరుకోరినగుడ్డరేపుపంపబడును" అని వర్తకునిభార్య చెప్పినది. వర్తకుడానాటిరాత్రి యింటికి రాగానే భార్య "దుకాణముమూసివేసితిరా?" అని అడిగినది. అవును, విశేషమేమి? అనిఆతడనెను. "ఇప్పుడేవెళ్లి మనదుకాణమునగలవానిలో శ్రేష్టమైన రెండుచీరలు తీసుకొని రండ"ని భార్యచెప్పగా "ఏమియీతొందఱ! ఉన్నవానిలో నెల్లమైలైన వానిని రేపు ఉదయాననే యిచ్చెదను" అని వర్తకుడుచెప్పెను. "అటులకాదు, యిప్పుడేయియ్యవలెను; లేదానకక్కఱనేలేదు"