పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

340

నూతికప్ప కాళ్లుబారసాచి "మీసముద్రము ఇంత విశాలముగా నుండునా?" అనెను.

"అంతకన్న చాలవిశాలముగానుండును" అని సముద్రపు కప్ప ప్రత్యుత్తరమిచ్చినది!

నూతికప్ప తానున్న చోటినుండి ఒక్కగంతువేసి "సముద్రము ఇంతగొప్పదిగానుండునా!" అనెను.

"మిత్రమా! సముద్రపువైశాల్యమును యీనూతితో పోల్చి చెప్పజూతువా?" అని సముద్రపుకప్ప జవాబిచ్చినది.

నూతికప్ప యిట్లునొక్కివక్కాణించినది:- "లేదు; ఈ నా బావికన్నపెద్దది ఎందునులేదు. నిజముగా, ఇంతకు మించి ఏదియు పెద్దదైయుండజాలదు. ఈ కప్ప బొంకులాడుచున్నది; దీనిని ఇక్కడనుండి లాగివేయవలయును."

సంకుచితాభిప్రాయములుగల నరులు ఈ తీరున నుందురు. తమ చిన్నచిన్నబావులలోకూర్చుండి జగమంతయు గూడ తమ నివాసములకన్న పెద్దదిగనుండజాలదని ధీరముగ వాదింతురు!

950. ఒకదొంగ రాజునింటికి కన్నమువేసి, అర్ధరాత్రివేళ లోపలప్రవేశించినాడు. రాజు తనకుమార్తెను ఏటిగట్టున నుండు సాధువులలో నొకనికిచ్చి పెండ్లిచేయుదునని రాణితో చెప్పుచుండగా వినినాడు. ఆదొంగ యిటుల తలపోసెను:- "మంచిది! నా అదృష్టముపండినది. రేపు నేను సాధువువేషము ధరించి ఏటికడనున్న సాధువులమధ్యకూర్చుందును. బహుశః రాజు తనకుమార్తెను నాకేయియ్యగలడు!"