పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

319

40వ అధ్యాయము.

గంధములు తెలియరాక వెలుపలనేయుండును. ధ్యానసమయమున ప్రధమమున యింద్రియానుభవములు మనస్సునకు గోచరించును; ధ్యానము తీక్షణమైనప్పుడు అవి గోచరించవు - సమీపించలేక దూరముగ నిలిచిపోవును.

915. క్షుద్రస్వభావములు గలవారు:- రోగనివారణము చేయుట, వ్యాజ్యములుగెలుచుట, నీటిపై నడచుట మొదలగు - మహిమలకొఱకును సిద్ధులకొఱకును దేవులాడుదురు. నిజమగు భక్తులు స్వామిచరణారవిందములుతప్ప యితరమును కోరనేకోరరు.

916. "మహాభావ" మనగా పరబ్రహ్మభావము. అది శరీరమునకును, మనస్సునకును గూడ భయంకరమగు విఘాతమును చేకూర్చును. మదపుటేనుగు చిన్నగుడిసెలోదూరి దానిని ఉఱ్ఱూతలూగించినటుల - ఒక్కొకప్పుడు దానిని భిన్నాభిన్నము చేసివేయును. ఈదశ గడచినయనంతరము, పూర్వము ఎంతదుఃఖము వాటిలునో అంతయధికమగు ఆనందము లభించును.

917. భగవంతునినుండివేఱుపడు భావనచేగలుగు విరహవేదన అబ్బా! చెప్పనలవికాదు. అటువంటివిరహవేదనను అనుభవించిన (శ్రీచైతన్యస్వామి శిష్యులగు) రూపుడు సనాతనుడు అనువారి తాపాగ్నివలన, వారేచెట్టునీడను కూర్చుండిరో ఆ చెట్టుఆకులు సయితము వాడిపోయినవట! అటువంటి దశలో నేను మూడుదినములు దాదాపు స్మృతిలేకయుంటిని! నేను కదలలేక ఒక చోటపడియుంటిని! నాకుకొంచెము స్పృహ