పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

305

40వ అధ్యాయము.

880. ప్రశ్న:- భగవాన్, సదసద్విచారముచేత, మున్ముందు ఇంద్రియ సంయమనమును సాధించుట అవసరమగునా?

ఉ:- మంచిది, అది యింకొక మార్గమే - సదసద్విచారపంథా! భక్తిమార్గమున యింద్రియనిగ్రహము దానంతనదియే వచ్చును. అతిసులభముగ వచ్చును. భగవంతునియెడ అనురక్తి హెచ్చినకొలదిని ఇంద్రియభోగములందు అరుచియేర్పడును. బిడ్డచచ్చినదినమున తలిదండ్రులు భోగముల చింతపెట్టుకొనరుగదా!

881. భగవద్భక్తిని ఒకకవి పెద్దపులికి పోల్చినాడు. పెద్దపులి మృగములను దిగమ్రింగులాగున భక్తి నరునిశత్రువర్గమగు కామక్రోధాధి వ్యసనములను మ్రింగివేయును. ఒక్కసారి భగవద్భక్తి పూర్ణప్రబోధమునుపొందెనా, కామము క్రోధము, మున్నగు దుర్వ్యసనములన్నియు నిర్మూలములగును. శ్రీకృష్ణ భక్తిమూలమున బృందావనగోపికలకు అటువంటిదశ ప్రాప్తించినది.

882. భక్తిని అంజనమునకును పోల్తురు. రాధ ఒకతడవ "ఒహో సఖులారా! నాకు సర్వత్ర శ్రీకృష్ణుడే కాన్పించు చున్నడు!" అనగా తక్కినగోపికలు "నీకండ్లకు ప్రేమాంజనమును పెట్టుకొన్నావు; అందుమూలమున నీకట్టుకాన్పించుచుండును!" అనిరి.

883. సిద్ధులలో రెండురీతులవారు కలరు; సాధనసిద్ధులు, కృపాసిద్ధులు. మంచిపంటపండించు కొఱకై కొందఱు అతి