పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

22

74. సాకారుడగుబ్రహ్మము మనకండ్లకు గోచరముకాగలడు. ఇంతేల వానినితాకగలము; మనప్రియమిత్రునితోడఎట్లో అట్లేముఖాముఖినివానితో ముచ్చటించవచ్చును.

75. పండుయొక్కగుజ్జు, పీచు, టెంక, అన్నియుఒకేవృక్షబీజమునుండికలుగునటుల, చేతనమును, జడమును, ఆధ్యాత్మకమును, భౌతికమును అగుసృష్టిసర్వమును ఒకేబ్రహ్మము నుండి ఉద్భవమగుచున్నది.

76. గురువుశిష్యునికి బోధలుచేయుసందర్భమున రెండువ్రేళ్లను ఎత్తిచూపెను. బ్రహ్మము మాయ అను ద్వంద్వభావమును ఆతఁడు అట్లుసూచించెను. తరువాత ఒకవ్రేలినిముడిచివేసి, మాయ తొలగిపోయినప్పుడు ఈవిశ్వమేమియు మిగులక ఒక్క అఖండబ్రహ్మమేయుండునని భోదసలిపెను.

77. ఒకడు కల్పవృక్షముక్రిందకూర్చుండి, తానురాజగుగాక! అనికోరుకొనెను. - తక్షణమే అతడురాజైనాడు. ఉత్తరక్షణమున నాకొకమనోహరిణియగు సుందరాంగి భార్య అగుగాక అని సంకల్పించెను. ఆహా! అట్టియువతివాని చెంత ప్రత్యక్షమైనది! ఇంకను అతడాచెట్టుయొక్క మహిమను శోధించబూని ఒకపులివచ్చినన్ను మ్రింగుగాకయని అనుకొనెను. అయ్యో! ఆఘడియయందే అతడొక పెద్దపులికోరలఁజిక్కి యుండెను. భగవంతుడే ఆకల్పవృక్షము. ఆయనసమ్ముఖమునఎవరేని "ఓదేవా! నాకేమియులేదు కదా!" అనుకొనినయడల నిజముగావానికి అన్నియుకొఱ