పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

299

40వ అధ్యాయము.

కాని వానితోడి సంయోగమహిమచేతనే ప్రకృతి సృష్టి, స్థితి లయములను చేయుచున్నది. రాధాకృష్ణవిగ్రహముయొక్క అర్థమును ఇదియే.

861. తల్లి తండ్రి, సోదరి సోదరుడు, భార్యాభర్త. బిడ్డలు, చుట్టాలు అను బంధుప్రేమయే "మాయ" సర్వజీవుల యెడలను సమమైప్రవహించు అనురాగమును "దయ" అందురు.

862. సత్యమందు తీవ్రభక్తికలవానికి భగవంతుడు ప్రత్యక్షమగును. ఇందుకు వ్యతిరేకముగా సత్యమునందు గౌరవములేక వర్తించునెడల వాని సర్వమును ఒక్కొకటే నాశమగును. సాక్షాత్కారదశను పొందినపిమ్మట నేను చేతులందు పూలు పట్టుకొని "ఓతల్లీ! ఈనీప్రకృతిజ్ఞానమును నీఅజ్ఞానమును, నీపుణ్యమును నీపాపమును, నీశుభమును నీఅశుభమును, నీధర్మమును నీఅధర్మమును, అన్నిటిని నీవేతీసికొనుము. దివ్యమాతా! వినిర్మలభక్తినిమాత్రము నా కొసగుము" అనిప్రార్థించితిని. అయినను నేనిట్లు ఆతల్లితో పలికినప్పుడు "నీసత్తును నీఅసత్తును తీసికొనుము" అనజాల నైతిని. ఆజగన్మాతకు నేను అన్నిటిని తిరిగి ఒసగితిని, కాని "సత్యము"ను విడువజాలనైతిని.

863. బ్రహ్మసాక్షాత్కారమునకు చిహ్నములలో నొకటిగ "మహావాయువు" అను మహచ్ఛక్తి ప్రబోధముగాంచి చంగున శిరస్సునకెగురును. అప్పుడు సమాధిలో పడుదుము. అంతట పరోక్షానుభూతి కల్గును.