పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

285

40వ అధ్యాయము.

817. (కేశవచంద్రసేనుల వారితో):- "తోటమాలి ఒక్కొకప్పుడు రోజాపూల మొక్కల వేళ్లపై మట్టితీసివేసి వానిపైని మంచుపడనిచ్చును. ఒక్కొకప్పుడు పూలుపెద్దవిగా పెరుగునిమిత్తము వేళ్లను నఱుకుచుండును. బహుశః భగవంతుడు నిన్నిటు ఘనకార్యములకై సిద్ధము చేయుచుండబోలును!

818. ఒకశిష్యుని ప్రశ్న:- శ్త్రీ జనమును మేమెటుల చూడవలయును?

ఉ:- బ్రహ్మ సాక్షాత్కారమును బడసి దివ్యదృష్టిని సంపాదించుకొనినవానికి వారినిచూచిన భయములేదు. ఆతడు వారి నిజస్వరూపముల గాంచును; వారాజగజ్జనని అంశములని తెలిసికొనును. కావున అటువంటివాడు వారియెడ గౌరవమర్యాదలను చూపుటేగాక, పుత్రుడు జననినివలె సాక్షాత్పూజల నర్పించును.

819. స్త్రీలు సద్గుణములతో జనించనీ లేకపోనీ, పతివ్రతలు కానీ వ్యభిచారిణులుకానీ, వారిని సర్వత్ర ఆనందమాయి దివ్యస్వరూపములుగ చూడవలయును.

820. వ్యవసాయదారులు గిత్తలబేరము ఎటులచేతురో తెలియునా? ఓహో! ఆవిషయములలో వారెంతయో నేర్పఱులు. మంచివానిని చెడ్డవానిని వివేకించుట వారికి చక్కగతెలియును. ఒకగిత్తయొక్క చుఱుకుదనమును కనుగొనుటెట్లో వారికి ఎఱుకయే; ఊరక తోకతాకెదరు; ఓహో! ఫలితము చిత్రము! చుఱుకుదనములేనివి చలించవు, నిద్రపోవు