పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

284

చిన్నగుడిసెలో జొఱబడినయెడల, అది దానిని ఉఱ్ఱూత లూగించి, విరుగలాగును. అటులనే ఆత్మావేశానుభవము చేత సాధకునిశరీరము కదలబారి ఒక్కొకప్పుడు విచ్చిపోవును. అప్పుడేమిజరుగునో తెలియునా? ఆయింటిలో నిప్పున్నయెడల చాలసామాగ్రిని తగులబెట్టివేయును. అటులనే దివ్యజ్ఞానాగ్నిచేత వ్యసనములన్నియు, కోపము మొదలగు శత్రువర్గము దహింపబడును. తుదకు "నేను, నాది" అను స్ఫృహయే నాశముచెందును. శరీరము తీవ్రబాధనుపొంది, చెదిఱిపోగలదు. సర్వమును ముగిసెనని నీవు తలంచవచ్చును. కాని "అహం" కారము లేశమేనియున్నంతవఱకును భగవంతుడు నిన్ను ముక్తునిచేయడు. నీవొకవైద్య చికిత్సాలయములో రోగిగాప్రవేశించినయెడల నీకు పూర్తిగ రోగముకుదురువఱకును నిన్ను విడువరు సుమీ!"

816. నాశరీరస్థితిని చూచినపిమ్మట "శరీరము ఇంత శుష్కించియున్న స్థితిలో అంత పారమార్థికత విజ్ఞానసంపద నే నెన్నడును చూచియుండలేదు" అని హృదయుడు అనేవాడు. నాశరీరము బలహీనముగనున్నను నేనితరులతో భగవంతుని గూర్చి ప్రసంగించుట మానలేదు. ఒకసారి, నాకు జ్ఞాపకమే, కేవలము శల్యావశిష్టముగనున్నాను; అప్పుడును నాకొక శరీరమున్నదనే గుర్తేలేకుండ గంటలకొలది కాలము పారమార్థిక విషయములగురించి ప్రసంగములు చేయుచుండెడి వాడను.