పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

283

40వ అధ్యాయము.

రముదే. ఈబాధయు ఈరోగమును ఆత్మను దఱిచేర జాలవు.

814. శరీరమునందు తీవ్రబాధయున్ననుకూడ, నరుడెట్లు ఆత్మవిచారముసలుపవలయునో ఎట్లుబ్రహ్మభావనయందు మునిగియుండవలయునో, నేర్పుకొఱకే అల జగన్మాత ఈ జబ్బును కల్పించినది. తీవ్రబాధతోడను, ఆకలితోడను శరీరము పీడనొందుచున్నసమయమున, నరుని వశమున నివారణోపాయములేనప్పుడును, ఈశరీరమునకు అధిపతి ఆత్మ సుమీ అని నాకు నాజనని బోధించుచున్నది. ఆత్మ దైవీయమనియు, బ్రహ్మభావము సత్యమైనదనియు, నరుడు సిద్ధత్వమును సాధించునప్పుడు సర్వబంధవిముక్తి లభ్యమగుననియు, విశ్వాసశూన్యులకు సందేహనివృత్తి చేయుకొఱకు దివ్యమాత ఈజబ్బును కల్పనచేసినది.

815. శ్రీ రామకృష్ణ పరమహంసులవారు కేశవచంద్రసేనులతో నిట్లనిరి:- "నీవుబాధపడుచున్నావు; కాని నీజబ్బునకు అర్థము గొప్పదిగనున్నది. ఈశరీరములో నీవుచాల ఆధ్యాత్మికావస్థలను గడిపియున్నావు. తత్ఫలితముగా ఈశరీరము బాధపడుచున్నది. పారమార్థికతరంగములేచునప్పుడు దేహస్మృతి అదృశ్యమగును; కాని అది తుదినిదేహమును బాధించును. గంగాజలములమీద పెద్దపొగయోడ నడుచునప్పుడు, కొంతసేపటికి పెద్దతరంగములులేచి ఒడ్డునకు కొట్టుకొనును. ఓడపెద్దదైనకొలదిని తరంగములదెబ్బ బలతరముగ నుండును. ఒక్కొకప్పుడు వానివలన ఒడ్డువిరిగిపడును. ఏనుగు