పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

282

మనస్సును ఏకాగ్రముచేసి మీరేల మీరోగమును కుదుర్చుకోరాదు?" అని అడిగిరి.

శ్రీ పరమహంసులవారిట్లనిరి:- "నేను బ్రహ్మార్పణముచేసియున్న మనస్సును కేవల రక్తమాంసకోశ మగు ఈశరీరముపైని ఎట్లు పెట్టగలను?"

శశిధరపండితులు మరల యిట్లనిరి:- "మీ జబ్బునెమ్మదింపజేయుమని జగజ్జననిని మీరేలప్రార్థింపరాదు?

శ్రీపరమహంసులవా రిట్లు జవాబుచెప్పిరి:- "నేను నాతల్లినిగూర్చి స్మరించినతోడనే నాస్థూలశరీరము అదృశ్యమైపోవును. నేను పూర్తిగ దానినుండి తొలగియుందును. కాబట్టి అప్పుడీస్థూలశరీరమును గురించి ప్రార్థించుటకే సాధ్యము కాదు."

813. శ్రీరామకృష్ణ పరమహంసులవారివ్యాధి ముదిరి, వారేమాత్రమును ఆహారపానీయములు తీసుకొనజాలని స్థితిలో ఇట్లువచించిరి.

"నేనిప్పుడు అనేకములగు నోళ్లతో మాటలాడుచు తినుచు ఉన్నాను. నేనుఆత్మలకు ఆత్మను, నాకు అనేకముఖములున్నవి. నేను అఖండాత్మను. గొంతులో పుండుగల నరచర్మముతో కప్పబడినాను. ఆశరీరము రోగగ్రస్తమైనప్పుడు, అది మనస్సును బాధించును. వేడినీరు మీదపడినప్పుడొకడు "ఈనీరు నన్ను కాల్చినది" అనవచ్చును. కాని సత్యమేమనగా, ఉష్ణము వానినికాల్చును గాని నీరెన్నడును కాల్చదు. బాధ యంతయు శరీరమునందుండును; రోగమంతయు శరీ