పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

281

40వ అధ్యాయము.

"నాహరి ఏమైపోవునో?" అనుతలంపు వానిని సంసారమునకు బంధించియే యుంచును. ఈడుపువలలో పడిన చేప బయట పడిపోవుతకు వీలున్నను అది పోజూడదు. కంబళిపురుగు తానల్లుకొనిన గూటిలో ముడుచుకొని పడియుండి అందేచచ్చును. ఇటువంటి సంసారము అసత్యము కాదా? మఱియు అశాశ్వతము కాదా?

810. పెద్దపిల్లలమందను కని పెంచినంతమాత్రాన నరుడు స్తుతిపాత్రుడు కాజాలడు. అందు సత్యమగు పురుషత్వమేమియులేదు. కుక్కలు పందులు సయితము పిల్లలను కనుట లేదా? పెంచుటలేదా? సత్యమగు పురుషత్వము స్వధర్మ నిర్వహణమున కలదు. అట్టిపౌరుషమును చూపినవాడు అర్జునుడొక్కడు!

811. బాహ్యప్రపంచస్ఫురణతో నున్నప్పుడు మనస్సు స్థూలవిషయములనే గమనించుచు, అన్నమయకోశమున వసించును. ఈకోశము అన్నముపై నాధారపడు జీవుని స్థూల కవచము. మనస్సు అంతర్ముఖమైనప్పుడు, ఇంటిద్వారమును బంధించి అంతఃపురమున ప్రవేశించినట్లగును. అనగా అది సూక్ష్మశరీరమునప్రవేశించి, అందుండి కారణశరీరము ప్రవేశించును. తుదకు మహాకారణమును చేరును. ఆదశయందు మనస్సు అవ్యయబ్రహ్మమున లయమగును. ఆస్థితిని గురించి ఏమివచించుటకును సాధ్యపడదు.

812. పరమహంసులవారు జబ్బుపడినప్పుడు శశిధరపండితులవారుచూచి "రోగగ్రస్తమైన అవయవముమీద