పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

280

808. ఎవనియందు బుద్ధియు హృదయమును పూర్ణవికాసమునుపొంది, సమతకువచ్చియుండునో, అట్టివాడు ధన్యుడు. అటువంటివాడు ఎచ్చటనున్నను సమంజసముగ వర్తింపజాలును. వాని నిర్మలభక్తి పరిపక్వముకాగా అతడు నిశ్చల విశ్వాసము గలిగియుండును. అప్పుడు అతడు యితరులతో నడుపు వ్యవహారములందు లోపముండదు. ఆతడు లౌకికవ్యవహారములను చక్క బెట్టునప్పుడు దక్షతచూపును; పండిత సభలందు, ఉత్తమవిద్యాప్రదర్శనముచేత తనవాదనను నిలుపుకొనును; తర్కమున అద్భుతచాతుర్యమును చూపును. తల్లిదండ్రులయెడ విధేయుడై భక్తిసలుపును; ఇరుగుపొరుగు వారియెడ దయాదాక్షిణ్యములు గలిగి ఉపకారము సలుపుటకు సిద్ధముగనుండును. భార్యయెడ ప్రేమంపువేలుపై వర్తించును. అట్టి పురుషుడే నిజముగా సిద్ధాత్ముడు!

809. సంసారము ఎంతఅశాశ్వితమైనదో నీకు తెలియును. మనముకాపురముండు యింటిసంగతి కొంచెము చూడుము. ఎంతమంది దానిలోపుట్టినారో! ఎంతమంది దానిలో చచ్చినారో! ప్రపంచవిషయములు మనయెదుట ఒక్కక్షణము కాన్పించును; మరునిమిషమున అదృశ్యమైపోవును. నీవారుగానీవుచూకొనువారు మరణమున నీవు కనుమూయగనే, నీవారనుమాట ముగియుచున్నది. సంసారికి ఎంతటిబలముగల బంధములుండునో చూడుము. కుటుంబములో తన పోషణపై నాధారపడువారెవరును లేకున్నను, మనుమని పెండ్లిచూడ వలయునను కోరికనుపెట్టుకొని, కాశికిపోవ నిరాకరించును.