పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

275

40వ అధ్యాయము.

పాండిత్యము, అహంకారము, గర్వము, మున్నగునవి, వాని హృదయమున గ్రంధులై కూడును.(బాధించును)

788. మనస్సును, హృదయమును, పవిత్రముచేయు చదువుమాత్రమే విద్య! తదితరమగు ఎఱుక అంతయు అవిద్యయే.

789. వంగభాషలో ఏమూడు అక్షరములకును ధ్వనిలో పోలికయుండదు. శ, ష, స, అనువానికి మాత్రము పోలిక కలదు. ఆమూటికికూడ "శాంతించుము" అను అర్ధముకలదు. దీనినిబట్టి మనము అక్షరాభ్యాసము చేయుచున్నప్పుడును, బాల్యమునుండియు "శాంతితోనుండుము" అను పాఠమునే నేర్చుచున్నామని గ్రహించవచ్చును. ప్రతివానికిని శాంతియే పరమభాగ్యము.

790. (1) సర్వోహం (అంతయు నేనే) (2) తత్వమసి (ఈసర్వమును నీవే) లేక (3) త్వమేనస్వామి; అహమేవసేవకః (నీవు యజమానివి; నేను సేవకుడను) అని పలుకగల చిత్తపరిపాకదశ నరునియందు కలిగినప్పుడు భగవంతుడు ప్రత్యక్షము కాగలడు.

791. స్త్రీ లందఱును, జగజ్జనని అవతారములే. కావున స్త్రీ జనమునెల్ల తల్లులుగ భావనచేయవలయును సుడీ!

792. సాధువును చూడబోవునప్పుడును, దేవాలయమునకు పోవునప్పుడును వట్టిచేతులతో పోతగదు. పూజ్యులకు అర్పణచేయుటకై ఏదేని స్వల్పముగనైనను తీసికొనిపోవలెను.