పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

274

(ఇట్లే మతధర్మములును ఆయాప్రచారకుల లోపములచేత దోషభూయిష్టములు కాగలవు).

782. సాధువే సాధువును గుర్తించగలడు. నూలువర్తకునకే నూలుయొక్కనాణెము గుణగణములు తెలియగలవు.

783. పాపము, రసము, (Mercury) జీర్ణమగుట దుర్లభము.

784. ముల్లంగిగడ్డ తినిన వానికి ముల్లంగివాసన త్రేణువులేవచ్చును; దోసకాయమెసవిన వానికి దోసకాయవాసన త్రేణువులేవచ్చును. అటులనే నోటవచ్చుమాటలు మనస్సులోనున్న సంకల్పములకు అనుసరణముగానె యుండును.

785. చాకలివానియింట ముఱికిగుడ్డలు అనేకముండును; కాని అవన్నియు వానివికావు. ఉతుకగానె వానియిల్లు కాళీ యగుచుండును. స్వంతసంకల్పములులేనివారు చాకలివాని పగిదినుందురు. భావములవిషయమున నీవు చాకలివానిలీల నుండకుము.

786. ఈశ్వరవాణి ఒక్కొకప్పుడు పిచ్చివారినోటను, త్రాగుబోతులనోటను, పసిబిడ్డలనోటను వినవచ్చును.

787. గ్రంథము అనగా సదా సచ్ఛాస్త్రమనిఅర్థముకాదు. "గ్రంధి" అనగా "ముడి" అను అర్ధముకూడ తఱచుగాదానికి చెల్లును. నరుడు గ్రంథమును చదువునప్పుడు, గర్వమును విడిచి పూర్ణ హృదయముతో సత్యమునుతెలిసికొనవలయును. అట్టి దీక్షలేనియెడల, వేడుకగా చదువుటచేత, విషమ