పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

270

766. "హరి" అనగా మన హృదయములను హరించువాడు అని అర్థము. "హరిబలము" అనగా మనబలము శ్రీహరి అన్నమాట.

767. పామరులు విమర్శింతురనిగాని, లోకము వెక్కిరించుననిగాని, మత సాధనగూర్చి లజ్జపడకుము. అటువంటి జనుల నందఱిని గణనచేయనర్హముగాని పురువులుగ నెంచుము.

768. మానవులు ఎంతసులభముగా స్తోత్రముచేయుదురో అంత సులభముగా నిందలు చేయుదురు. కావున వారు నిన్ను గూర్చి యేమన్నను సరకుసేయకుము.

769. నిత్యమును అనిత్యముసాహాయముననే కనుగొనవలయును; సత్యమును అసత్యము నాధారముచేసికొని కనుగొనవలయును. నిర్వికారమును సవికారముయొక్క సాహాయ్యమున ప్రాపించవలయును.

770. గృహస్థులుగానుండి మోక్షసాధనముల సాగించువారు కోటగోడ చాటునుండి పోరాడు యోధులవంటివారు. సంసారములత్యజించి బ్రహ్మసాధనలకుపూను సన్యాసులు బయట బయలుమీద యుద్ధముచేయు భటులుబోలువారు. బయట బయలునందు పోరాడుటకంటె కోటలోపల నుండి యుద్ధముచేయుట ఎక్కువక్షేమకరమును సుకరమును గూడనగును.

771. అనులోమ విలోమనాదమని తర్కమురెండుతెగలుగలది, అనులోమప్రకరణమున సృష్టినాధారముచేసికొని సృష్టికర్తను తెలిసికొందుము; అనగా "కార్యము"