పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

268

760. లేగదూడచాలచుఱుకుగను, ఆనందముగను, కాన్పించును. దినమంతయు చంగుచంగున దుముకులాడుచుండును. తల్లికడ పాలుత్రాగునప్పుడు మాత్రమే నిలకడగ నుండును. కాడిమెడమీదవేసి పలుపుపెట్టగనే నిరుత్సాహము చెంది, ఆనందమునకు మారుగా దుఃఖమును మోమున దాల్చును. క్రమక్రమముగా చిక్కి శల్యమగును. సంసారబాధలు మీదపడనంతవఱకును బాలురు ఆనందముతో కేళీలుగొట్టుచుందురు. వివాహబంధముతో సంసారమున తగుల్కొని, కుటుంబబాధ్యతను నెత్తినబడగానే పొంగిపాటు అణగును. ముఖమున నిరుత్సాహము, విచారము, దిగులు మూర్తీభవించును. క్రమముగా ముఖము ముడతలుపడి, చెక్కిళ్లనుండి యౌవనతేజము జారిపోవును. ప్రాతఃకాలమారుతము వలెను; నవకోమల పుష్పములీలను, హిమవారి బిందుపోల్కిని ఆజన్మాంతము బాలవికాసమును నిలుపుకొనువాని జన్మధన్యము!

761. క్రొత్తగా పట్టణమునకువచ్చువాడు, రాత్రి పరుండుటకు తగిన గదినొకదానిని మొదటగా విచారించుకొని అచ్చట తనసామానును చేర్చుకొనవలెను. ఆపిమ్మట స్వేచ్ఛగా నగరవిచిత్రముల జూడపోవచ్చును. అటుల చేయనిచో రాత్రి చీకటిలో నిలువతావులేక చాలబాధలు పడవలసివచ్చును. అటులనే ముందుగా భగవంతునియందు నిత్య శాంతిధామమును కుదుర్చుకొని, అనంతరము తన నిత్యకృత్యములమీద ఇటునటు సంచరించుట క్రొత్తగా సంసారమున ప్రవేశించినవానికి క్షేమము. లేదా మృత్యువను భీకరకాళ