పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40వ అధ్యాయము.

వివిధాంశములు.

741. నరుడు రెండురకముల సంస్కారములతో పుట్టుచున్నాడు: (1) విద్యా సంస్కారము :- ఇది మోక్షము వైపునకు దారిజూపును. (2) అవిద్యాసంస్కారము :- ఇది సంసారమువైపునకు బంధనమునకును దారితీయును. పుట్టుకసమయమునందు ఈరెండుసంస్కారములు త్రాసు సిబ్బెలవలె సమముగానుండుననవచ్చును. సంసారము తన సుఖములను ఆనందములను ఒకసిబ్బెలో వేయును; ఆత్మ తన ఆకర్షణను రెండవసిబ్బెలో నిడును. మనస్సు సంసారమును కోరుకొనెనా ఆసిబ్బెబరువై క్రిందికిదిగును. అటులకాక ఆత్మను కోరుకొనెనా ఆసిబ్బెబరువై దైవము వైపునకు దిగును.

742. ప్రశ్న:- జీవన్ముక్తునియందు మాయయుండునా?

ఉ:- శుద్ధ మేలిమిబంగారుతో నగలను చేయుట పొసగదు; ఏదో కొంత కలితీ కలపవలెను. నరునికి శరీర మొకటి యున్నంతకాలమును ఆశరీరధర్మములు నడచుకొఱకు కొంతమాయ యుండవలయును. బొత్తుగ మాయచేవిడువబడిన యతడు యిరువదియొక్క దినములకంటె బ్రతుకడు.

743. ప్రశ్న:- కృతనిశ్చయబుద్ధిలేక తాత్కాలికపు విరక్తిచే సంసారమునుత్యజించిన సన్యాసి స్వభావమెటులుండును?