పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

254

ములతో పూజింపబడును. ఆయన భిన్నభిన్నములగు భావనలతోడను విధానములతోడను పూజింపబడినను, అనగా కొందఱు భగవంతుని తండ్రిఅనినను, కొందఱు తల్లిఅనినను కొందఱు సఖిఅనినను, మఱికొందఱు నాధాఅనినను, మఱికొందఱు ఆయనను తమహృదయకోశమందలి పెన్నిధిగ భావనచేసినను, ఇంకకొందఱు వానిని తమ పసిబిడ్డగ జూచుకొనినను; ఒకేదేవుడు వేర్వేఱు భావనాసంబంధములతో పూజింపబడుచుండెనన్నమాటయే!

718. ఒకసారి బర్డ్వాను మహారాజు నాస్థానమునందు శివుడుఘనుడా విష్ణువుఘనుడాయని పండితులలో చర్చబయలుదేఱినది. సభ్యులలో కొందఱు శివుడు శ్రేష్ఠుడనిరి; మఱికొందఱు విష్ణుడు శ్రేష్ఠుడనిరి. చర్చతీవ్రరూపము దాల్చినది. అప్పుడొక పండితుడు "అయ్యలారా! నేను శివుని చూడలేదు, విష్ణుని చూడలేదు. వారిరువురిలో ఎవరుఘనుడో నేనెట్లు చెప్పగలను?" అనెను ఆవిధముగా ఒక దేవతను మఱొక దేవతతోపోల్చి తారతమ్యము నెంచబోకుడు. దేవతలలో ఒక్కనిసాక్షాత్కారమును పడసినను, దేవతలందఱును ఒకే బ్రహ్మముయొక్క వ్యక్తస్వరూపములే అని తెలిసిపోవును.

719. ప్రశ్న :- అన్నిమతములలోని దేవుడును ఒక్కడే అగునెడల ఆయన వేర్వేఱుమతములవారిచేత వేర్వేఱువిధముగా వర్ణింపబడుటేల?