పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

253

38వ అధ్యాయము.

ఏరూపమునచ్చునో దాని సాహాయముననే నీవు వాని సాక్షాత్కారమును పొందగలవు.

714. కుమ్మరిదుకాణములో కుండలు, కూజాలు, డాకలు, మూకుళ్లు మున్నగునవి అనేక పరిమాణములతో అనేక స్వరూపములతో నుండును. కాని అన్నియు ఒకే మట్టితో చేయబడినవియే. అటులనే భగవంతుడు ఒక్కడు; కాని ఆయాయుగములలో, ఆయాదేశములలో భిన్నభిన్న నామములతోడను భిన్నభిన్న స్వరూప లక్షణములతోడను పూజింపబడుచుండును.

715. ఒకే పంచదార పక్షులు మృగములు మొదలగు ననేకచిత్రరూపములను పొందగల్గును. అటులనే మధురమూర్తియగు జగజ్జనని వేర్వేఱుయుగములందు వేర్వేఱు ప్రదేశములందు వేర్వేఱు నామరూపములదాల్చి పూజల నందును.

716. వేర్వేఱుమతసాంప్రదాయములు భగవంతునిచేరుట కగు వేర్వేఱుమార్గములే. కాళీఘట్టమునందలి కాళీయాలయమునకు భిన్నభిన్నమార్గములు చాలగనున్నవి. అటులనే స్వామిసదనముచేరుటకు మార్గములనేకములున్నవి. ప్రతిమతశాఖయు మానవులను భగవంతునికడచేర్చుట కుపయోగించు ఒకానొకత్రోవ అన్నమాటే!

717. ఒకేబంగారముతో వేర్వేఱుపేరులుగల వేర్వేఱు రూపములతో నుండు నగలుచేయబడుతీరున ఒకేదేవుడు వేర్వేఱు దేశములలో వేర్వేఱు కాలములందు వేర్వేఱు నామరూప