పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

247

36వ అధ్యాయము.

హంసులవారు వానిని మందలించి యిట్లనిరి:- "సిగ్గు సిగ్గు! బిడ్డా! నీశక్తియుక్తులను ఇట్టి క్షుద్రవిషయములందు వ్యయము చేయకుము!"

699. మందులిచ్చుచు , గంజాభంగీలను సేవించుసాధువు యోగ్యుడనతగదు. అటువంటివాని సాంగత్యముచేయకుడు.

700. నేను పంచవటికడ తీవ్రసాధనలు చేయుచుండు దినములలో గిరిజ అను నొకపురుషుడు అచ్చటికివచ్చెను. ఆయన గొప్పయోగి. ఒకతడవ చీకటిరాత్రిలో, నేను నాగదిదగ్గఱకు పోవయత్నించుచుండగా, అయన తనచేతిని పై కెత్తినాడు. వానిచంకలోనుండి గొప్పవెలుగుబయలు దేఱి మార్గమంతయు చక్కగ కాన్పించినది. నాహితవాక్కునువిని, ఆయన తనసిద్ధిని వినియోగించుట మానివేసి, బ్రహ్మసాధనకై తన మనస్సును మరల్చినాడు. కొన్నాళ్లకు వాని కాశక్తితగ్గిపోయినది; కాని సత్యమగు పరమార్ధమును సంపాదించుకొనగల్గినాడు.

701. ఒకశిష్యుడు తానుధ్యానముచేయు సమయమున దూరమున జరుగుసంగతులు ప్రత్యక్షముగ తనకుగోచరించుననియు ఆసమయమున కొందఱుప్రజలు ఏమిచేయుచుందురో స్పష్టముగ తెలియవచ్చుననియు, అనంతరము విచారించగా తనఅనుభవము సత్యములయ్యెననియు, శ్రీపరమహంసులవారి కెఱిగించెను. అంతట వారు బిడ్డా! కొన్నిదినములు ధ్యానమునుమానుము. ఇట్టిదూరదర్శనములు మున్నగుమహిమలు బ్రహ్మసాక్షాత్కారమునకు అడ్డుతగులును సుమీ!" అని చెప్పిరి.