పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36వ అధ్యాయము.

మహిమలు

696. సిద్ధులకొఱకై దేవులాడువారినిమహిమలప్రకటించువారిని దరిచేరకుడు. అట్టిపురుషులు బ్రహ్మపధమును వదలి చరించువారు. బ్రహ్మముంజేరు యాత్రాపధమున, అడ్డమువచ్చుచుండు మహిమల వలలలో వారిబుద్ధులు తగులువడి యుండును. ఈ మహిమలంగూర్చి హెచ్చరికతోనుండు వానికై ఆశపడకుడు.

697. ఒకడు పదునాలుగేండ్లు అడవిలో ఘోరతపస్సుచేసి, తుదకు నీళ్లపైనినడుచుసిద్ధిని సంపాదించినాడు. ఈసిద్ధికలిగెనని ఆనందపరవశుడై, తనగురుసన్నిధికిపోయి, "గురుదేవా! గురుదేవా! నేను నీటిపైనినడుచు మహిమను పడసితిని!" అనెను. వానిగురువు వానినిట్లు చీవాట్లుపెట్టినాడు. "ఛీఛీ! పదునాలుగేండ్లశ్రమకు ఇదియాఫలము? ఆహా! నీవొక కాని డబ్బును సంపాదించినవాడవైతివి! నీవుపదునాలుగేండ్లు పాటుపడి గడించినదానిని సామాన్యనరులు పడవవానికి కానిడబ్బు నిచ్చి పొందగలరు సుమీ!"

698. భగవాన్ శ్రీరామకృష్ణపరమహంసులవారి బాలశిష్యులలో ఒకడు ఇతరుల మనోభావములను ముఖముచూచి గ్రహించుశక్తిగలవాడయ్యెను. దీనింగూర్చి అత్యానందభరితుడై వచ్చి తనశక్తినిగురించి గురుదేవులతో ప్రశంసించెను. పరమ